రాత్రి 8 గంటలకు ప్రధాని మోడీ అత్యవసర సమావేశం
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగుతున్న కేసుల తీవ్రతలో ఎంత మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక్కరోజు వ్యవధిలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు అన్ని రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోవడంతో పాటు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో వైద్య ఉన్నతాధికారులతో కరోనా వ్యాప్తి […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగుతున్న కేసుల తీవ్రతలో ఎంత మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక్కరోజు వ్యవధిలో రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరో వైపు అన్ని రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో బెడ్స్ నిండిపోవడంతో పాటు, ఆక్సిజన్ కొరత తీవ్రంగా మారింది.
ఈ నేపథ్యంలోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ శనివారం రాత్రి 8గంటల ప్రాంతంలో వైద్య ఉన్నతాధికారులతో కరోనా వ్యాప్తి తీవ్రతపై అత్యున్నత సమావేశం నిర్వహించనున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత, వ్యాక్సినేషన్ లభ్యతపై ఉన్నతాధికారులను అడిగి తెలుసుకోనున్నట్లు సమాచారం. దీంతో పాటే కొవిడ్ నియంత్రణకు మరేదైనా నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది.