జో బైడెన్‌కు ప్రధాని మోడీ ఫోన్..

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాకు నూతనంగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. యూఎస్‌కు 46వ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతల మధ్య పలుకీలక అంశాలపై సంభాషణ నెలకొంది. ఇండో-యూఎస్ వ్యుహాత్మక భాగస్వామ్యం పట్ల భారత్ తన నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు, మా భాగస్వామ్య ప్రాధాన్యతలు కొవిడ్ -19 మహమ్మారిపై ఆందోళనలను వ్యక్త పరిచినట్లు తెలిపారు. అంతేకాకుండా, వాతావరణ మార్పు మరియు […]

Update: 2020-11-17 20:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అమెరికాకు నూతనంగా ఎన్నికైన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. యూఎస్‌కు 46వ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఇరువురు దేశాధినేతల మధ్య పలుకీలక అంశాలపై సంభాషణ నెలకొంది.

ఇండో-యూఎస్ వ్యుహాత్మక భాగస్వామ్యం పట్ల భారత్ తన నిబద్ధతను పునరుద్ఘాటించినట్లు, మా భాగస్వామ్య ప్రాధాన్యతలు కొవిడ్ -19 మహమ్మారిపై ఆందోళనలను వ్యక్త పరిచినట్లు తెలిపారు. అంతేకాకుండా, వాతావరణ మార్పు మరియు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో ఇరుదేశాల పరస్పర సహకారంపై చర్చించినట్లు ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

Tags:    

Similar News