ఆవిర్భావ దినోత్సవం జరపండి: కేవీ చలమయ్య
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాను 4-6-2008న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ఏడాది ఆడంబరంగా జిల్లా ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ తరువాత దాని ఊసే లేకుండా పోయింది. దీనిపై నెల్లూరు జిల్లా రొటేరియన్, పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత కేవీ చలమయ్య జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరిబాబుకు విజ్ఞాపనపత్రం అందజేశారు. జూన్ 4న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని […]
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాను 4-6-2008న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి ఏడాది ఆడంబరంగా జిల్లా ఆవిర్భావదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ తరువాత దాని ఊసే లేకుండా పోయింది. దీనిపై నెల్లూరు జిల్లా రొటేరియన్, పొట్టి శ్రీరాములు అవార్డు గ్రహీత కేవీ చలమయ్య జిల్లా కలెక్టర్ యం.వి.శేషగిరిబాబుకు విజ్ఞాపనపత్రం అందజేశారు. జూన్ 4న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని కోరారు. ఇందుకు ప్రకాశం జిల్లాను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. 1970 నుంచి ఒంగోలు జిల్లా ప్రకాశం జిల్లాగా ఏర్పడి నాటి నుంచి ఆవర్భావదినోత్సవ వేడుకలు జరుపుకుంటోందని అన్నారు. నెల్లూరులో కూడా వేడుకలు జరపాలని సూచించారు. ఇప్పటికి చాలా సార్లు మెమొరాండంలు సమర్పించినా స్పందించడం లేదని ఆరోపించారు.