సబ్‌స్ర్కైబర్లకు ‘సోని’ గుడ్ న్యూస్

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా సోని కంపెనీ.. మొబైల్ గేమింగ్ సబ్‌స్క్రైబర్లకు స్పెషల్ గిఫ్ట్‌ అందించింది. సోని ప్లేస్టేషన్ నెట్‌వర్క్ (ఎస్‌పీ‌ఎన్) ప్లాట్‌ఫామ్ అయిన ‘ప్లే స్టేషన్ ప్లస్’ యూజర్లకు దశలవారీగా కొత్త గేమ్స్(మ్యాన్ ఈటర్, శాడో ఆఫ్ టాంబ్ రెయిడర్, గ్రీడ్ ఫాల్) ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ‘ప్లేస్టేషన్ ప్లస్’ ద్వారా 2021 నూతనోత్తేజంతో ప్రారంభం కాబోతోందని.. ఈ మేరకు ప్లేస్టేషన్ ప్లస్ సభ్యులు సరికొత్త యాక్షన్‌ ఓరియెంటెడ్ అండ్ అడ్వెంచరస్ గేమ్స్ పొందుతారని’ […]

Update: 2021-01-01 08:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: న్యూ ఇయర్ సందర్భంగా సోని కంపెనీ.. మొబైల్ గేమింగ్ సబ్‌స్క్రైబర్లకు స్పెషల్ గిఫ్ట్‌ అందించింది. సోని ప్లేస్టేషన్ నెట్‌వర్క్ (ఎస్‌పీ‌ఎన్) ప్లాట్‌ఫామ్ అయిన ‘ప్లే స్టేషన్ ప్లస్’ యూజర్లకు దశలవారీగా కొత్త గేమ్స్(మ్యాన్ ఈటర్, శాడో ఆఫ్ టాంబ్ రెయిడర్, గ్రీడ్ ఫాల్) ఉచితంగా అందుబాటులోకి రాబోతున్నాయి. ‘ప్లేస్టేషన్ ప్లస్’ ద్వారా 2021 నూతనోత్తేజంతో ప్రారంభం కాబోతోందని.. ఈ మేరకు ప్లేస్టేషన్ ప్లస్ సభ్యులు సరికొత్త యాక్షన్‌ ఓరియెంటెడ్ అండ్ అడ్వెంచరస్ గేమ్స్ పొందుతారని’ కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 5 నుంచి ‘మ్యాన్ ఈటర్’ గేమ్ అందుబాటులో ఉండబోతుందని తెలిపింది. రాక్షస బల్లుల్లా ఉండే సొరచేపలు మానవ జాతిని తినేందుకు ప్రయత్నిస్తుండగా.. వాటిని చంపి మానవ జాతిని కాపాడుకొనే థీమ్‌తో గేమ్ ప్లే చేయాల్సి ఉంటుంది. కాగా శాడో ఆఫ్ టాంబ్ రెయిడర్, గ్రీడ్ ఫాల్ గేమ్స్ కూడా త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తాయని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News