ఇన్‌స్టాగ్రామ్ పోస్టులతో రూ. కోట్లు సాంపాదిస్తున్నారు

దిశ, స్పోర్ట్స్: క్రీడాకారులు తమ ఆటలు, ఎండోర్స్‌మెంట్ల ద్వారానే కాకుండా సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది. హాపర్‌హెచ్‌క్యూ అనే సంస్థ 2021లో అత్యధికంగా సంపాదించిన ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీల లిస్టును తయారు చేసింది. ‘ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్’ పేరుతో ఆ జాబితానువిడుదల చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోఅత్యంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. 308 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్న అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో […]

Update: 2021-07-02 08:51 GMT

దిశ, స్పోర్ట్స్: క్రీడాకారులు తమ ఆటలు, ఎండోర్స్‌మెంట్ల ద్వారానే కాకుండా సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా భారీగా సంపాదిస్తున్నట్లు ఒక సర్వేలో తేలింది. హాపర్‌హెచ్‌క్యూ అనే సంస్థ 2021లో అత్యధికంగా సంపాదించిన ఇన్‌స్టాగ్రామ్ సెలబ్రిటీల లిస్టును తయారు చేసింది. ‘ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్’ పేరుతో ఆ జాబితానువిడుదల చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచంలోఅత్యంత ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో. 308 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్న అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పేయింగ్ ప్రమోషన్ కోసం ఒక్కో పోస్టుకు 1.6 మిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.11.96 కోట్లు తీసుకుంటున్నాడు.

టాప్ 10లో ఉన్న మరో ఆటగాడు అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ. అతడికి ఇన్‌స్టాగ్రామ్‌లో 224 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఒక్క పెయిడ్ పోస్టుకు 1.16 మిలియన్ డాలర్లు దాదాపు రూ. 8.67 కోట్లు తీసుకుంటున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పోస్టుకు రూ. 5 కోట్ల వరకు అర్జిస్తున్నాడు. కోహ్లీ ఈ జాబితాలో 19 స్థానంలో ఉన్నాడు. టాప్ 20లో ఉన్న ఏకైక క్రికెటర్ కోహ్లీ మాత్రమే. ఈ సర్వేలో 395 మందితో జాబితా రూపొందించగా.. ఇండియా నుంచి కేవలం కోహ్లీకి మాత్రమే స్థానం దక్కింది.

Tags:    

Similar News