అలా చేస్తే ఫ్లాట్ ఫామ్ టికెట్ ఫ్రీ

ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో.. గుంజీలు తీస్తే ఫ్రీగా ప్లాట్‌ఫామ్ టికెట్ జారీ అయ్యేలా సరికొత్త టికెట్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ మెషీన్ ముందు ఎవరైనా సరే కొన్ని గుంజీలు తీసినట్లైతే దానంతట అదే టికెట్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని […]

Update: 2020-02-21 08:53 GMT

ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో.. గుంజీలు తీస్తే ఫ్రీగా ప్లాట్‌ఫామ్ టికెట్ జారీ అయ్యేలా సరికొత్త టికెట్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఆ మెషీన్ ముందు ఎవరైనా సరే కొన్ని గుంజీలు తీసినట్లైతే దానంతట అదే టికెట్ వస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆరోగ్య రక్షణపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని.. దీని ద్వారా డబ్బు సేవ్ అవడంతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News