నేటి నుంచి తెలంగాణలో ప్లాస్మా థెరపీ

– రెండు ఆస్పత్రుల్లో అనుమతించిన ఐసీఎంఆర్ – మొదటి విడతలో 15 మంది నుంచి సేకరణ దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీ చికిత్సలు ప్రారంభం కానున్నాయి. గాంధీ ఆస్పత్రితో పాటు ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు ఐసీఎంఆర్ ఇప్పటికే అనుమతించింది. కరోనా నుంచి కోలుకున్నవారిలో 15 మంది గతంలోనే ప్లాస్మా ఇచ్చేందుకు తమ అంగీకారం తెలపగా.. మరో 200 మంది కూడా ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో […]

Update: 2020-05-10 10:17 GMT

– రెండు ఆస్పత్రుల్లో అనుమతించిన ఐసీఎంఆర్
– మొదటి విడతలో 15 మంది నుంచి సేకరణ

దిశ, న్యూస్‌బ్యూరో: తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపీ చికిత్సలు ప్రారంభం కానున్నాయి. గాంధీ ఆస్పత్రితో పాటు ఈఎస్ఐ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ చేసేందుకు ఐసీఎంఆర్ ఇప్పటికే అనుమతించింది. కరోనా నుంచి కోలుకున్నవారిలో 15 మంది గతంలోనే ప్లాస్మా ఇచ్చేందుకు తమ అంగీకారం తెలపగా.. మరో 200 మంది కూడా ప్లాస్మా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ సేవలను నేటి నుంచి ప్రారంభించనున్నారు. ప్లాస్మా థెరపీలో భాగంగా మొదటగా 15 మంది ప్లాస్మా సేకరించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరంతా కూడా విదేశీయులే కావడం గమనార్హం. ప్లాస్మా దాతల నుంచి సేకరించిన రక్తంలో ప్లాస్మాను వేరు చేసి చికిత్సలో ఉపయోగిస్తారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా చికిత్స ద్వారా చికిత్స తీసుకునేందుకు ఐదుగురు మాత్రమే అర్హత కలిగి ఉన్నారు.

ప్లాస్మా థెరపీలో ఏం చేస్తారంటే..

ప్లాస్మా దాతల్లో ఒక్కొక్కరి నుంచి వంద మిల్లీలీటర్ల రక్తాన్ని సేకరిస్తారు. రక్తంలో నీటి రూపంలో కనిపించే ద్రవాన్నే ప్లాస్మా అంటారు. ఆస్పెరిసిన్ విధానం ద్వారా రక్తం నుంచి ప్లాస్మాను వేరు చేసేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. వైరస్ నుంచి కోలుకున్న వారి నుంచి మాత్రమే రక్తాన్ని సేకరించి అందులోని ప్లాస్మాను వేరు చేస్తారు. కరోనా కారణంగా ఎక్కువ అనారోగ్యానికి గురైన వారికే ఈ చికిత్స ఉపయోగిస్తారు. కరోనా చికిత్స పొందిన వారి శరీరంలో కరోనా యాంటీబాడీలు ఎక్కువ సంఖ్యలో తయారై ఉంటాయి. వీటిని మరొక వ్యక్తి శరీరంలో ఎక్కించడం ద్వారా కరోనాను జయించడమే ప్లాస్మా థెరపీ లక్ష్యం. ఒక వ్యక్తి నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా నలుగురు రోగులకు ఈ థెరపీతో చికిత్స చేయవచ్చు. మనిషి దేహంలోకి ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్‌లను చంపే యాంటీ బాడీలు ప్లాస్మాలో ఉంటాయి.

Tags:    

Similar News