హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లదు.. ఆరోగ్య శ్రీలో చేర్చరు?

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్‌ ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, కుటుంబ ఆరోగ్య భద్రత కోసం రూపాయి రూపాయి పోగు చేసి హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు కడితే.. అవి చెల్లవని చెప్పి కొవిడ్ బాధితులను చేర్చుకోవడంలేదని షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్యులు అప్పులు చేసి కొవిడ్‌ చికిత్స పొందలేక, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి సామాన్యుల జీవనం అస్తవ్యస్తమైందన్నారు. […]

Update: 2021-05-05 10:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్‌ ఆస్పత్రులు అందినకాడికి దోచుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని, కుటుంబ ఆరోగ్య భద్రత కోసం రూపాయి రూపాయి పోగు చేసి హెల్త్‌ ఇన్సూరెన్స్‌లు కడితే.. అవి చెల్లవని చెప్పి కొవిడ్ బాధితులను చేర్చుకోవడంలేదని షర్మిల అనుచరుడు పిట్టా రాంరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సామాన్యులు అప్పులు చేసి కొవిడ్‌ చికిత్స పొందలేక, ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధి కోల్పోయి సామాన్యుల జీవనం అస్తవ్యస్తమైందన్నారు. ఆదుకోవాల్సిన సర్కార్‌.. నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహర్తిస్తోందని విమర్శించారు.

విపత్కర సమయంలో మంత్రులను తొలగిస్తూ నీచ రాజకీయాలు చేస్తోందన్నారు. కరోనా వైద్యం అందక పేదల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని, వారి బాధలు గుర్తించి ఇప్పటికైనా కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఉపాధి కోల్పోయిన కూలీలు, తోపుడుబండ్ల వ్యాపారులు, రజకులు, చేతి వృత్తులను నమ్ముకొని పొట్టపోసుకునే వారిని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రతి కుటుంబానికి రూ.2 వేల చొప్పున ఆర్థికసాయాన్ని అందించాలని రాంరెడ్డి డిమాండ్ చేశారు. రేషన్‌ సరుకులు, మరో 5 కేజీల బియ్యాన్ని అదనంగా ఇవ్వాలని కేసీఆర్‌ సర్కార్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్ద రైతును అని చెప్పుకునే సీఎం కేసీఆర్‌ ఆ మాటను మరువకుండా రైతులను ఆదుకోవాలన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags:    

Similar News