బోల్డ్ కంటెంట్‌తో ‘పిట్ట కథలు’ ట్రైలర్..
దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్ ‘పిట్ట కథలు’ ట్రైలర్ రిలీజైంది. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఆంథాలజీ.. ప్రేమ, ద్రోహం కాన్సెప్ట్ మీద తెరకెక్కింది. ‘ఎల్లప్పుడూ ప్రేమ శాశ్వతం’గా ఉండాలని అనుకుంటాం.. దానిని కేవలం ఓ ‘కోరిక’గానే పరిగణిస్తాం. ప్రేమ విషయంలో జరిగిన ద్రోహం ‘క్షమించరానిది’ ఎప్పుడు అవుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమను ‘ఆపలేము’ అనే విషయాలను హైలైట్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేయగా.. శ్రుతి […]
దిశ, సినిమా: నెట్‌ఫ్లిక్స్ ఫస్ట్ తెలుగు ఒరిజినల్స్ ‘పిట్ట కథలు’ ట్రైలర్ రిలీజైంది. తరుణ్ భాస్కర్, నందిని రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఆంథాలజీ.. ప్రేమ, ద్రోహం కాన్సెప్ట్ మీద తెరకెక్కింది. ‘ఎల్లప్పుడూ ప్రేమ శాశ్వతం’గా ఉండాలని అనుకుంటాం.. దానిని కేవలం ఓ ‘కోరిక’గానే పరిగణిస్తాం. ప్రేమ విషయంలో జరిగిన ద్రోహం ‘క్షమించరానిది’ ఎప్పుడు అవుతుంది? ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమను ‘ఆపలేము’ అనే విషయాలను హైలైట్ చేస్తూ ట్రైలర్ రిలీజ్ చేయగా.. శ్రుతి హాసన్, అమలా పాల్, ఈషా రెబ్బా, లక్ష్మీ ప్రసన్న, జగపతిబాబు, సత్యదేవ్ ప్రధానపాత్రల్లో నటించారు. అమలాపాల్‌ను అనుమానించే భర్తగా జగపతిబాబు కనిపించగా.. తనను కాదన్న వ్యక్తిని ప్రేమలో పడేసే క్యారెక్టర్‌లో శ్రుతి హాసన్, పవర్‌ఫుల్ పొలిటిషియన్‌గా లక్ష్మీప్రసన్న కనిపించింది. కాగా ఈ తెలుగు ఆంథాలజీ ‘పిట్ట కథలు’ ఫిబ్రవరి 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానుంది.
Love, betrayal and holograms? VR signing up for this right now.#PittaKathalu@TharunBhasckerD @LakshmiManchu @SaanveMegghana @bethiganti_ @nandureddy4u @IamJagguBhai @Amala_ams #AshwinKakamanu @nagashwin7 @shrutihaasan @TheSanjithhegde #SangeethShoban @anishkuruvilla pic.twitter.com/BfO0gItRr1
— Netflix India (@NetflixIndia) February 5, 2021