డ్రా దిశగా పింక్ బాల్ టెస్ట్
దిశ, స్పోర్ట్స్: ఇండియా – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నది. తొలి రెండు రోజులు వర్షం కారణంగా టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌కు పలు ఆటంకాలు కలిగాయి. రెండో రోజు స్మృతి మంధాన సెంచరీతో ఆకట్టుకోగా.. మూడో రోజు దీప్తి శర్మ (66) అర్ధ సెంచరీ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 276/5తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నిలకడగా ఆడింది. క్రీజులో […]
దిశ, స్పోర్ట్స్: ఇండియా – ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ఏకైక పింక్ బాల్ డే/నైట్ టెస్ట్ మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్నది. తొలి రెండు రోజులు వర్షం కారణంగా టీమ్ ఇండియా ఇన్నింగ్స్‌కు పలు ఆటంకాలు కలిగాయి. రెండో రోజు స్మృతి మంధాన సెంచరీతో ఆకట్టుకోగా.. మూడో రోజు దీప్తి శర్మ (66) అర్ధ సెంచరీ చేసింది. ఓవర్ నైట్ స్కోర్ 276/5తో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియా నిలకడగా ఆడింది. క్రీజులో స్టాండ్ అయిన తానియా భాటియా (22) క్యాంప్‌బెల్ బౌలింగ్‌లో హీలీకి క్యాచ్ ఇచ్చి అవుటైంది. ఇక దీప్తి శర్మ, వస్త్రాకర్ కలసి 7వ వికెట్‌కు 40 పరుగులు జోడించారు. అయితే పెర్రీ బౌలింగ్‌లో పూజా వస్త్రాకర్ (13) మూనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యింది. మరో ఎండ్‌లో ఉన్న దీప్తి శర్మ మాత్రం నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టింది. డిన్నర్ విరామ సమయానికి టీమ్ ఇండియా 359/7 స్కోర్ వద్ద నిలిచింది. అప్పటికే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న దీప్తి (66) లంచ్ అనంతరం క్యాంప్‌బెల్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవీలియన్ చేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే భారత జట్టు 377/8 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఎల్లిస్ పెర్రీ, స్టెల్లా క్యాంప్‌బెల్, సోఫీ మోలిన్యూక్స్ తలా రెండు వికెట్లు తీయగా.. గార్డెనర్‌కు ఒక వికెట్ లభించింది.
తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మహిళలకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ బెత్ మూనీ (4) జులన్ గోస్వామి బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యింది. ఆ తర్వాత మరో ఓపెనర్ అలీసా హీలీ, మెగ్ లాన్నింగ్ కలిని రెండో వికెట్‌కు 49 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని మరోసారి గోస్వామి విడదీసింది. అలీసా హీలీ (29) జులన్ గోస్వామి బౌలింగ్‌లో కీపర్ తానియా భాటియాకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరింది. అయితే భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తుండటంతో ఆస్ట్రేలియా భారీ భాగస్వామ్యాలు నెలకొల్పలేక పోయింది. మెగ్ లాన్నింగ్ (38) పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటైంది. ఇక తాహిలా మెక్‌గ్రాత్ (28) వికెట్ కూడా వస్త్రాకర్ తీసింది. దీంతో 119 పరుగులకే ఆస్ట్రేలియా 4 వికెట్లు కోల్పోయింది. ఎల్లీస్ పెర్రీ (27), గార్డెనర్ (13) మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మహిళలు 4 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేశారు.
పింక్ బాల్ టెస్టులో ఇంకా ఒకరోజే మిగిలి ఉన్నది. ఆ ముడు సెషన్లలో ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం, టార్గెట్ సెట్ చేసి మళ్లీ ఆస్ట్రేలియాను అవుట్ చేయడం దాదాపు అసాధ్యం. దీంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
స్కోర్ :
ఇండియా ఉమెన్ 377/8 డిక్లేర్డ్
ఆస్ట్రేలియా ఉమెన్ 143/4