Centre Govt : 97.5 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని దాదాపు 97.5 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)కు కేంద్రప్రభుత్వం(Centre Govt) తెలిపింది.

Update: 2024-11-02 17:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో : దేశంలోని దాదాపు 97.5 శాతం పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయని సుప్రీంకోర్టు(Supreme Court)కు కేంద్రప్రభుత్వం(Centre Govt) తెలిపింది. ఈ సౌకర్యమున్న పాఠశాలల జాబితాలో ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లు, ప్రైవేటు స్కూళ్లు ఉన్నాయని పేర్కొంది. స్కూళ్లలో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లను నిర్మించాలంటూ కాంగ్రెస్ నాయకురాలు, సామాజిక కార్యకర్త జయా ఠాకూర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) ప్రస్తుతం పెండింగ్‌ దశలో ఉంది.

ఈ పిల్‌కు బదులిస్తూ దాఖలు చేసిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈవివరాలను వెల్లడించింది. బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో ఢిల్లీ, గోవా, పుదుచ్చేరి సహా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 100 శాతం లక్ష్యాన్ని సాధించాయని సర్కారు తెలిపింది. 10 లక్షలకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో బాలురకు 16 లక్షల టాయిలెట్లు, బాలికలకు 17.5 లక్షల టాయిలెట్లను నిర్మించామని పేర్కొంది. గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లలో బాలురకు 2.5 లక్షల టాయిలెట్లు, బాలికలకు 2.9 లక్షల టాయిలెట్లను నిర్మించామని చెప్పింది.

Tags:    

Similar News