సీఎం పదవికి పినరయి రాజీనామా

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో సీపీఐ(ఎం) సారథ్యం వహిస్తు్న్న ఎల్డీఎఫ్‌ను 99 స్థానాల్లో నిలిపిన ఆయన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌‌‌ను క‌లిసి తన రాజీనామా లేఖను అంద‌జేశారు. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్‌ను గవర్నర్ కోరారు. కాగా కొత్త […]

Update: 2021-05-03 11:19 GMT

తిరువనంతపురం : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆదివారం వెలువడిన ఫలితాల్లో సీపీఐ(ఎం) సారథ్యం వహిస్తు్న్న ఎల్డీఎఫ్‌ను 99 స్థానాల్లో నిలిపిన ఆయన మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాజ్‌భవన్‌కు వెళ్లిన సీఎం.. గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌‌‌ను క‌లిసి తన రాజీనామా లేఖను అంద‌జేశారు. అయితే, కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ముఖ్యమంత్రిగా కొనసాగాలని విజయన్‌ను గవర్నర్ కోరారు. కాగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపైనా విజయన్ స్పందించారు. త్వరలోనే ఎల్డీఎఫ్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశమై దానిపై చర్చిస్తామని తెలిపారు. ఈ దఫా క్యాబినెట్‌లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది.

ఈనెల 7న స్టాలిన్ ప్రమాణ స్వీకారం

చెన్నై : తమిళ‌నాడు సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల7న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరోనా నేపథ్యంలో ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని సాదాసీదాగా నిర్వహించనున్నట్టు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. కాగా చెన్నైలోని కలైంజ్ఙర్ అరంగంలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో మంగళవారం కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలోనే స్టాలిన్‌ను శాసనసభపక్ష నేతగా ఎన్నుకోనున్నారు.

Tags:    

Similar News