పోలీసులపై హైకోర్టులో పిల్..నేడు విచారణ

లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్ ) దాఖలైంది. దీనిని హైకోర్టులో బుధవారం విచారణ జరపనుంది. ఓ ప్రముఖ న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదికి లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు. కొద్ది రోజుల […]

Update: 2020-04-07 21:07 GMT

లాక్ డౌన్ సందర్భంగా పోలీసులు ప్రజల పట్ల ప్రవరిస్తున్న తీరుకు నిరసనగా తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్ ) దాఖలైంది. దీనిని హైకోర్టులో బుధవారం విచారణ జరపనుంది. ఓ ప్రముఖ న్యాయవాది రాసిన లేఖను హైకోర్టు పిల్ గా స్వీకరించింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రజలపై పోలీసులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాదికి లేఖ రాశారు. ఐదు పేజీల ఆ లేఖను ప్రధాన న్యాయమూర్తికి న్యాయవాది ఉమేష్ చంద్ర అందజేశారు. కొద్ది రోజుల క్రితం వనపర్తిలో తండ్రి కొడుకు బైక్ పై వెళ్తుండగా పోలీసులు దాడి ఘటనను లేఖలో ప్రస్తావించారు. దాడి చేసిన పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఉమేష్ చంద్ర కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణ రహితంగా కొట్టారంటూ ఆరోపించారు. జ్యూడిషియల్ కమిటీ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచక్షణ రహితంగా కొట్టే హక్కు పోలీసులకు ఏ విధంగా ఉందో తెలపాలని పిటిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో లేఖను పిల్ గా హైకోర్టు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని నేడు ఉదయం న్యాయం స్థానం విచారణ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలపై పోలీసులు దాడులకు సంబంధించి వివరాలను పిటిషనర్ అందించారు.

Tags: Telangana, High Court, police, pill, Enquiry

Tags:    

Similar News