పియా రియా అవుతుంది సరే.. నీ సంగతేంటి?

దిశ, వెబ్‌డెస్క్: పియా బాజ్‌పాయి.. ‘రంగం’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌లో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది. ఒక వేళ కామెంట్ చేస్తే ఎవరికి ఎలా రిప్లయ్ ఇవ్వాలో కూడా బాగా తెలుసు. తాజాగా ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు చెంపచెల్లుమనే రీతిలో ఘాటు సమాధానం […]

Update: 2020-09-10 02:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: పియా బాజ్‌పాయి.. ‘రంగం’ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కోలీవుడ్‌లో పలు హిట్ సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఫాలోవర్స్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటూ పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకుంటుంది. ఒక వేళ కామెంట్ చేస్తే ఎవరికి ఎలా రిప్లయ్ ఇవ్వాలో కూడా బాగా తెలుసు.

తాజాగా ఓ నెటిజన్ పెట్టిన కామెంట్‌కు చెంపచెల్లుమనే రీతిలో ఘాటు సమాధానం ఇచ్చింది పియా. బాలీవుడ్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డ్రగ్ డీలర్స్‌తో సంబంధం ఉందని తాజాగా తనను అరెస్ట్ చేశారు కూడా. ఈ క్రమంలో ‘ఫ్యాక్ట్ ఫిల్టర్’ అనే పేరుతో ఉన్న ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పియాకు రియా చక్రవర్తి అయ్యే అన్ని లక్షణాలు ఉన్నాయి.. కావాల్సింది మహేష్ భట్ ఒక్కడే అంటూ కామెంట్ చేశాడు. దీనిపై స్పందించిన పియా.. ‘నా విషయం పక్కన పెట్టి మీ గురించి చెప్పండి. అసలు మీలో ఏ సామర్థ్యం ఉందో చెప్పండి, ప్రతీ విషయం ఫిల్టర్ అయిపోయాక’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.

అయితే అలాంటి పిచ్చి జనాలకు మీరు రిప్లయ్ ఇవ్వాల్సిన అవసరం లేదని అభిమానులు అనడంతో.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాను, టైమ్ పాస్ చేస్తున్నానని తెలిపింది పియా. దీంతో ఎపిక్ రిప్లయ్ ఇచ్చావ్.. శభాష్ అంటున్నారు నెటిజన్లు.

Read Also..

భయం మరణంతో సమానం : పార్వతి

Full View

Tags:    

Similar News