ఆసక్తి కనబరచని వైద్యాధికారులు

దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా రోగులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒప్పంద పద్ధతిన వైద్య అధికారుల పోస్టులు భర్తీ చేయడానికి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఇచ్చారు. ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆడిషినల్ కలెక్టర్ సీతారాం, డీఆర్వో స్వర్ణలత, జిల్లా వైద్య అధికారి కృష్ణలు ఇంటర్వూలు చేసి అభ్యర్థులు వివరాలను ఆన్లైన్లో రాష్ట్ర వైద్య సంచాలకులకు పంపించారు. […]

Update: 2020-07-31 06:31 GMT

దిశ, మహబూబ్‌నగర్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా రోగులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం ఒప్పంద పద్ధతిన వైద్య అధికారుల పోస్టులు భర్తీ చేయడానికి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదల చేశారు. 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఇచ్చారు. ఉదయం నుంచి జిల్లా కలెక్టర్ వెంకట్రావు, ఆడిషినల్ కలెక్టర్ సీతారాం, డీఆర్వో స్వర్ణలత, జిల్లా వైద్య అధికారి కృష్ణలు ఇంటర్వూలు చేసి అభ్యర్థులు వివరాలను ఆన్లైన్లో రాష్ట్ర వైద్య సంచాలకులకు పంపించారు. వీరిని త్వరలోనే ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఎంత మంది వైద్యులు వస్తే అంత మందిని నియమించుకునే అవకాశం ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా వైద్యులు అనసక్తి చూపించట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News