80 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు వెల్లడించాయి. సుమారు 80 రోజుల తర్వాత మొదటిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. చివరిసారి మార్చి 16న పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. కొంత విరామం తర్వాత లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఇంధనానికి డిమాండ్ పెరిగింది. పైగా, క్రూడాయిల్ బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు […]

Update: 2020-06-07 07:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు వెల్లడించాయి. సుమారు 80 రోజుల తర్వాత మొదటిసారిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం గమనార్హం. చివరిసారి మార్చి 16న పెట్రోల్, డీజిల్ ధరలను సవరించారు. కొంత విరామం తర్వాత లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఇంధనానికి డిమాండ్ పెరిగింది. పైగా, క్రూడాయిల్ బ్యారెల్ ధర 40 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ క్రమంలోనే ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ మీద లీటర్‌కు 60 పైసల చొప్పున పెంచడానికి నిర్ణయించాయి. గతంలో, లాక్ డౌన్ వల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోయిన కొన్ని రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్ మీద కరోనా ట్యాక్స్ విధించిన సంగతి తెలిసిందే. మే నెలలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మీద లీటర్‌కు రూ.10, డీజిల్ లీటర్‌కు రూ.13 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని విధించాయి. అయితే, క్రూడాయిల్ ధరలు పతనంతో ప్రజల మీద ధరల భారం నేరుగా పడలేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధర శుక్రవారం 42 డాలర్లుగా ఉంది. కరోనా వైరస్ దెబ్బకు, లాక్‌డౌన్ వల్ల ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం 46 శాతం క్షీణించింది.

ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 74.61, డీజిల్ రూ. 68.42గా ఉంది.
* రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రూ. 71.86, డీజిల్ రూ. 69.99.
* ముంబైలో పెట్రోల్ రూ. 78.91, డీజిల్ రూ. 68.79.
* బెంగలూరు పెట్రోల్ రూ. 74.18, డీజిలి రూ. 66.54.
* చెన్నై పెట్రోల్ రూ. 76.07, డీజిల్ రూ. 68.74.

Tags:    

Similar News