రోజుకో రూపాయి చొప్పున.. మూడోరోజూ పెరిగిన చమురు ధరలు!
దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో ఎన్నడూ లేనంత సుధీర్ఘమైన లాక్‌డౌన్ కారణంగా విక్రయాలు లేక డీలా పడ్డ చమురు కంపెనీలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో ధరల మంట రాజేస్తున్నాయి. ఆదివారం నుంచి మొదలుపెట్టిన ధరలు పెంపు వరుసగా మూడోరోజూ ధరలను పెంచి వాహనదారులపై భారాన్ని పెంచుతున్నారు. ఇంతకాలం జరిగిన నష్టాలను భర్తీ చేసేందుకు ఒకేసారి పెంచితే ప్రజల నుంచి ఆందోళన పెరుగుతుందని రోజూ రూపాయి చొప్పున పెంచుతున్నాయి. ఇక, మంగళవారం పెట్రోల్‌పై లీటర్‌కు 54 పైసలు, డీజిల్‌పై 58 […]
దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలో ఎన్నడూ లేనంత సుధీర్ఘమైన లాక్‌డౌన్ కారణంగా విక్రయాలు లేక డీలా పడ్డ చమురు కంపెనీలు, లాక్‌డౌన్ ఆంక్షల సడలింపులతో ధరల మంట రాజేస్తున్నాయి. ఆదివారం నుంచి మొదలుపెట్టిన ధరలు పెంపు వరుసగా మూడోరోజూ ధరలను పెంచి వాహనదారులపై భారాన్ని పెంచుతున్నారు. ఇంతకాలం జరిగిన నష్టాలను భర్తీ చేసేందుకు ఒకేసారి పెంచితే ప్రజల నుంచి ఆందోళన పెరుగుతుందని రోజూ రూపాయి చొప్పున పెంచుతున్నాయి. ఇక, మంగళవారం పెట్రోల్‌పై లీటర్‌కు 54 పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెంచాయి. తాజా సవరణలతో రాజధాని ఢిల్లీలో పెట్రోల్ డీజిల్ ధర రూ.72.46 నుంచి రూ.73కి చేరగా, డీజిల్ లీటర్‌కు రూ.70.59 నుంచి రూ. 71.17కి చేరింది. లాక్‌డౌన్‌కు ముందు మార్చి 14న కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై రూ.3 చొప్పును పెంచినప్పటికీ ఆ భారం ప్రజలపై ఉండకూడదని నిబంధన విధించింది. ఏప్రిల్‌లో పెట్రోల్, డీజిల్ వాడకం భారీగా క్షీణించింది. తర్వాత మే 6న కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ.10, డీజిల్‌పై రూ.13 పెంచింది. ఆ భారం కూడా ప్రజలపై పడకూడదని నిబంధన విధించింది. గత వారం నుంచి లాక్‌డౌన్ ఆంక్షల్లో మినహాయింపులు ఇచ్చిన తర్వాత.. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకెంత పెంచుతారోనని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
ప్రధాన నగరాల్లో ధరల వివరాలను పరిశీలిస్తే…
హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 75.78, డీజిల్ రూ. 69.56గా ఉంది.
* ఢిల్లీలో పెట్రోల్ రూ.73, డీజిల్ రూ.71.17
* ముంబైలో పెట్రోల్ రూ.80.01, డీజిల్ రూ.69.92.
* చెన్నై పెట్రోల్ రూ.77.08, డీజిల్ రూ.69.74గా ఉంది.
* బెంగళూరులో పెట్రోల్ రూ. 75.35. డీజిల్ రూ. 67.66గా ఉంది.