నువ్వు లేక నేను లేనంటూ.. ప్రియుడి సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మొన్నిమధ్యే అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మృతిని జీర్ణించుకోలేక ప్రియుడు ఆమె సమాధి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో ఆదివారం వెలుగులోకివచ్చింది. ఇవాళ ఉదయం ప్రయురాలి మృతదేహానికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే ప్రియురాలు లేని లోకంలో నేను ఉండలేను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం […]

Update: 2020-10-25 04:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. మొన్నిమధ్యే అనారోగ్యంతో ప్రియురాలు మృతి చెందింది. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మృతిని జీర్ణించుకోలేక ప్రియుడు ఆమె సమాధి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకరమైన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుదురుపల్లిలో ఆదివారం వెలుగులోకివచ్చింది.

ఇవాళ ఉదయం ప్రయురాలి మృతదేహానికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అంతకుముందే ప్రియురాలు లేని లోకంలో నేను ఉండలేను అని వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. ఈ విషయం తెలియడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags:    

Similar News