పెద్దపల్లిలో దారుణం.. ప్రయాణికులు చూస్తుండగానే రాజధాని ట్రైన్‌కు ఎదురెళ్లిన యువకుడు

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని యువకుడు ప్రయాణికులు చూస్తుండగానే రైలు కింద పడి మృతి చెందిన దారుణమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మల్లేశ్వర్ జిల్లా ఒడిశాలోని ఖైదా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ బెహరా (27)లు అనే యువకుడు వృతి రీత్యా హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ షాప్‌లో పనిచేసేవాడు. అయితే, సదరు యువకుడికి ఐదు సంవత్సరాల నుంచి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గత […]

Update: 2021-11-21 10:00 GMT

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వే స్టేషన్‌లో మతి స్థిమితం లేని యువకుడు ప్రయాణికులు చూస్తుండగానే రైలు కింద పడి మృతి చెందిన దారుణమైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మల్లేశ్వర్ జిల్లా ఒడిశాలోని ఖైదా గ్రామానికి చెందిన సంజయ్ కుమార్ బెహరా (27)లు అనే యువకుడు వృతి రీత్యా హైదరాబాద్‌లోని హార్డ్‌వేర్ షాప్‌లో పనిచేసేవాడు. అయితే, సదరు యువకుడికి ఐదు సంవత్సరాల నుంచి సరిగ్గా మతిస్థిమితం లేకపోవడంతో కుటుంబ సభ్యులు గత కొన్ని రోజులుగా చికిత్స అందిస్తున్నారు.

ఈ క్రమంలో సంజయ్ కుమార్ బేహ్రాకు నాలుగు రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం రావడంతో పూర్తిగా మతిస్థిమితం కోల్పోయి మనుషులను గుర్తుపట్టలేని స్థితికి చేరుకుని రామగుండం రైల్వే స్టేషన్‌లో ఒకటో నెంబర్ ప్లాట్‌ఫాంపై వస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు ఎదురుగా వెళ్లి మృతి చెందాడు. ఈ ఘటనను చూసిన ప్రయాణికులు ఒక్కసారిగా బిత్తరపోయారు. అయితే, సంజయ్ కుమార్ బిహ్రా హైదరాబాద్ నుంచి రామగుండంకు ఎలా వచ్చాడనే దానిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.

Tags:    

Similar News