ధర్మసాగర్ వాగులో ఒకరి గల్లంతు..
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం ధర్మసాగర్ వద్దగల వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వివరాల్లోకివెళితే.. ధర్మసాగర్‌కు చెందిన సింగడే గణపతి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పని నిమిత్తం గౌరాపూర్ గ్రామానికి వెళ్లాడు. పని పూర్తయ్యాక తిరిగి వస్తుండగా జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి […]
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సిరికొండ మండలం ధర్మసాగర్ వద్దగల వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.
వివరాల్లోకివెళితే.. ధర్మసాగర్‌కు చెందిన సింగడే గణపతి అనే వ్యక్తి మరో ఇద్దరితో కలిసి పని నిమిత్తం గౌరాపూర్ గ్రామానికి వెళ్లాడు. పని పూర్తయ్యాక తిరిగి వస్తుండగా జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ధర్మసాగర్ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటేందుకు ఈ ముగ్గురు మిత్రులు ప్రయత్నించారు కానీ వీలు పడలేదు. మిగతా ఇద్దరు వాగు ఒడ్డునే వేచి చూస్తుండగా, గణపతి వాగు దాటే ప్రయత్నం చేశాడు.
ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాగులో కొట్టుకుపోయాడు. తోటి మిత్రులు గ్రామస్తులకు సమాచారం అందించగా, వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికార యంత్రాంగం గజ ఈతగాళ్ల సాయంతో ఆ వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా, గణపతి ఆచూకీ లభించలేదు. సహాయక చర్యలు మాత్రం కొనసాగుతూనే ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.