గృహహింస.. భర్తను హతమార్చిన భార్య

దిశ, వెబ్ డెస్క్: రోజువారీగా మద్యం తాగి వచ్చి కొడుతుండటంతో విసిగిపోయిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా మొగుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని కూతురు, అల్లుడికి చెప్పి వారిని ఒప్పించింది. రోజు లాగానే భర్త ఫూటుగా మద్యం తాగి వచ్చి పడుకున్నాక.. కుటుంబసభ్యులంతా కలసి మరోవ్యక్తి సాయంతో ఆ ఇంటిపెద్దను హత్యచేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం […]

Update: 2020-08-21 09:58 GMT

దిశ, వెబ్ డెస్క్: రోజువారీగా మద్యం తాగి వచ్చి కొడుతుండటంతో విసిగిపోయిన భార్య కఠిన నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా మొగుడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఈ విషయాన్ని కూతురు, అల్లుడికి చెప్పి వారిని ఒప్పించింది. రోజు లాగానే భర్త ఫూటుగా మద్యం తాగి వచ్చి పడుకున్నాక.. కుటుంబసభ్యులంతా కలసి మరోవ్యక్తి సాయంతో ఆ ఇంటిపెద్దను హత్యచేశారు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ ఘటన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. నాగ శేషులు, శ్రీదేవి భార్యా భర్తలు. వీరికి ఓ కూతురు ఉండగా, ఆమెకు వివాహం జరిగింది. అయితే, భర్త నాగశేషులు రోజువారీగా మద్యం సేవించి వచ్చి భార్యను వేధింపులకు గురిచేసేవాడు. తరచు ఇలానే చేస్తుండటంతో విసిగిపోయిన భర్త అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అల్లుడు, కూతురు తో సహా దగ్గర బంధువు సుబ్బారాయుడుతో కలిసి భర్త హత్యకు ప్లాన్ వేసింది.

ఈ నెల 13న రాత్రి మద్యం మత్తులో నాగశేషులు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఫుల్లుగా మద్యం తాగి ఉన్న నాగశేషులు నిద్రలోకి జారుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులంతా కలిసి రోకలి బండతో నాగ శేషులు తలపై బలంగా మోదీ హత్యచేశారు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించారు.ఆటోలో మృతదేహాన్ని తరలిస్తున్న సమయంలో ఓ చోట పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. వారిని చూడగానే భయంతో శవాన్ని ఆటోలోనే వదిలేసి వీరంతా పరారయ్యారు. అనుమానం వచ్చిన పోలీసులు ఆటోలో చూడగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Tags:    

Similar News