వేధింపులు తట్టుకోలేకనే ఆ కుటుంబం ఆత్మహత్య..
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వేధింపులు తట్టుకోలేకనే అతను కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల రోజాకుంటకు చెందిన అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆత్మహత్యకు ముందు బాధిత కుటుంబం తీసుకున్న సెల్పీ వీడియో బయటపడింది. తాను ఏ తప్పూ చేయకున్నా దొంగతనం మోపి […]
దిశ, ఏపీ బ్యూరో: ఇటీవల అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా వేధింపులు తట్టుకోలేకనే అతను కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్నూలు జిల్లా నంద్యాల రోజాకుంటకు చెందిన అబ్దుల్ సలామ్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆత్మహత్యకు ముందు బాధిత కుటుంబం తీసుకున్న సెల్పీ వీడియో బయటపడింది. తాను ఏ తప్పూ చేయకున్నా దొంగతనం మోపి జైలుకు పోలీసులు పంపారని ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసుల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వీడియోలో కన్నీటి పర్యంతమయ్యాడు. అతని భార్యతో సహా కుటుంబం మొత్తం ధీనంగా వేడుకుంటున్న దృశ్యాలు కంటతడిపెట్టించేలా ఉన్నాయి. ఈ ఘటనపై మంగళగిరిలో డీజీపీని సలామ్ కుటుంబ బంధువులు, మిత్రులు శనివారం కలిశారు. ఆధారాలను ఆయన ముందుంచారు. తక్షణమే ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో ఎవరు తప్పు చేసినా వారిపై చర్యలు తీసుకుంటామని బాధితులకు డీజీపీ సవాంగ్ భరోసానిచ్చారు.