ఆర్థిక ఇబ్బందులు తాళలేక… వ్యక్తి ఆత్మహత్య
దిశ, వరంగల్ సిటీ: కరోనాతో ప్రపంచమంతా కాకవికాలం అవుతోంది. పేదవాడి పరిస్థితి మరింత దిగజారిపోతోంది. పేదవాడికి పట్టెడన్నం కరువవుతోంది. పనులు లేక కుటుంబ పోషణ భారం అవుతోంది. గత్యంతరం లేని పేదలు నమ్ముకున్న వాళ్ళకి నాలుగు అన్నం ముద్దలు పెట్టలేని దుస్థితిలో బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఒక హృదయ విధారకార ఘటన వరంగల్ నగరంలోని 12వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి […]
దిశ, వరంగల్ సిటీ: కరోనాతో ప్రపంచమంతా కాకవికాలం అవుతోంది. పేదవాడి పరిస్థితి మరింత దిగజారిపోతోంది. పేదవాడికి పట్టెడన్నం కరువవుతోంది. పనులు లేక కుటుంబ పోషణ భారం అవుతోంది. గత్యంతరం లేని పేదలు నమ్ముకున్న వాళ్ళకి నాలుగు అన్నం ముద్దలు పెట్టలేని దుస్థితిలో బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఒక హృదయ విధారకార ఘటన వరంగల్ నగరంలోని 12వ డివిజన్ ఎన్టీఆర్ నగర్‌లో మంగళవారం చోటు చేసుకుంది.
మృతుని కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన కొత్తపల్లి శంకర్ (50) కూలి పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే కరోనా నేపథ్యంలో 5 నెలలుగా పనులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆర్థికంగా మరింత చితికిపోయాడు. దీనితో మానసికంగా మరింత తీవ్ర మనో వేదనకు గురై, చేసేదేమీలేక మంగళవారం సాయంత్రం కోటిలింగాల గుడి సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా మృతునికి భార్య పద్మ , కుమార్తెలు రమ్య, నవ్య ఉన్నారు.