అసభ్యంగా దూషించాడని.. వ్యక్తి దారుణ హత్య
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో మునుపెన్నడూ జరగని దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళలను అసభ్య పదజాలంతో దూషించాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పాములపాడు ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన బోనాల సంజన్న (45) సాయంకాలం మద్యం సేవించి మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు. అదే గ్రామానికి చెందిన వెంకటరమణ, అతని కుమారులు వెంకటకృష్ణ, ధర్మేంద్ర, మరో బంధువు ఆగ్రహానికి గురై గొడ్డలి, కర్రలతో అతనిపై విచక్షణా […]
దిశ, వెబ్‌డెస్క్ : కర్నూలు జిల్లాలో మునుపెన్నడూ జరగని దారుణ ఘటన చోటుచేసుకుంది. మహిళలను అసభ్య పదజాలంతో దూషించాడనే నెపంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. పాములపాడు ఎస్సై రాజ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని వేంపెంట గ్రామానికి చెందిన బోనాల సంజన్న (45) సాయంకాలం మద్యం సేవించి మహిళలను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టాడు.
అదే గ్రామానికి చెందిన వెంకటరమణ, అతని కుమారులు వెంకటకృష్ణ, ధర్మేంద్ర, మరో బంధువు ఆగ్రహానికి గురై గొడ్డలి, కర్రలతో అతనిపై విచక్షణా రహితంగా దాడి చేశారు. తల, శరీరంపై తీవ్ర రక్తస్రావంతో సంజన్న పడిపోయాడు. బంధువులు అతడిని ఆత్మకూరు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అంతేకాకుండా ఈ దాడిలో అడ్డుపడిన మృతుని తల్లి కూడా తీవ్రంగా గాయపడింది.అయితే, దాడికి పాల్పడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.