నిందితునికి సహకరించిన వ్యక్తి అరెస్టు

దిశ, క్రైమ్ బ్యూరో: ఓ స్థలం వివాదంలో నిందితునికి సహకరించిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీసీఎస్ ఎస్ఐ మక్సూద్ అలీ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడకు చెందిన రహీముద్దీన్‌కు 10,540 చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉంది. దీనిని నిమ్మగడ్డ రాజా గిరిధర్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు 2005లో విక్రయించారు. మరల ఇదే స్థలాన్ని రహీముద్దీన్ తన కుమార్తె పేరుపై గిఫ్ట్ డీడ్ రాసిచ్చాడు. అంతే […]

Update: 2020-06-19 11:44 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: ఓ స్థలం వివాదంలో నిందితునికి సహకరించిన వ్యక్తిని సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సీసీఎస్ ఎస్ఐ మక్సూద్ అలీ కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజిగూడకు చెందిన రహీముద్దీన్‌కు 10,540 చదరపు గజాల విస్తీర్ణంలో స్థలం ఉంది. దీనిని నిమ్మగడ్డ రాజా గిరిధర్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులకు 2005లో విక్రయించారు. మరల ఇదే స్థలాన్ని రహీముద్దీన్ తన కుమార్తె పేరుపై గిఫ్ట్ డీడ్ రాసిచ్చాడు. అంతే కాకుండా, ఆ స్థలాన్ని హైదరాబాద్ నానల్ నగర్ పీఎన్బీ బ్యాంక్‌లో రూ.2.90 కోట్లకు తనఖా పెట్టారు. అందుకోసం తప్పుడు డాక్యుమెంట్లు తయారీలో నిందితుడు రహీముద్దీన్‌కు సహకరించిన వనస్థలిపురంకు చెందిన యెన్నం వెంకట శివారెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags:    

Similar News