అమ్మకానికి చిరుత పులి పిల్ల.. పోస్టు వైరల్!

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా యుగంలో కొందరు టైంపాస్ అవ్వక లేదా తమ స్నేహితులను, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆటపట్టించేందుకు సామాజిక మాద్యమాల్లో కొందరు వింత వింత పోస్టులు పెడుతుంటారు. అయితే, ఆ పోస్టులే కొన్నిసార్లు వాళ్ల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఓ వ్యక్తి కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన వద్ద చిరుత పులి పిల్ల […]

Update: 2021-07-25 05:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా యుగంలో కొందరు టైంపాస్ అవ్వక లేదా తమ స్నేహితులను, ఫ్యామిలీ మెంబర్స్‌ను ఆటపట్టించేందుకు సామాజిక మాద్యమాల్లో కొందరు వింత వింత పోస్టులు పెడుతుంటారు. అయితే, ఆ పోస్టులే కొన్నిసార్లు వాళ్ల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టివేస్తుంటాయి. తాజాగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టి ఓ వ్యక్తి కటకటలాపాలయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే.. ఓ వ్యక్తి తన వద్ద చిరుత పులి పిల్ల ఉందని.. దానిని అమ్ముతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. అది కాస్త వైరల్ అవ్వడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా జస్ట్ ఫర్ ఫన్ కోసం అలా పోస్టు పెట్టినట్లు వివరణ ఇచ్చాడు. అతని ఇంట్లో తనిఖీలు నిర్వహించగా ఎలాంటి చిరుత పులి పిల్ల లభ్యం కాలేదని అటవీ శాఖ అధికారి వెల్లడించారు. దీంతో ఆ పోస్టు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేసి, చర్యలకు ఉపక్రమించినట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News