ఉద్యోగ కల్పన తెలుసు తొలగింపు కాదు: పేర్ని నాని

దిశ ఏపీబ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీలో 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్టు వచ్చిన వార్తలను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులెవర్నీ తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్స్యూరెన్స్ లేని కారణంగా, తొలుత ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన మాత్రమే ఉంటుందని, ఉద్యోగాల […]

Update: 2020-05-16 06:58 GMT

దిశ ఏపీబ్యూరో: ఏపీఎస్ ఆర్టీసీలో 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించినట్టు వచ్చిన వార్తలను రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఖండించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులెవర్నీ తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్స్యూరెన్స్ లేని కారణంగా, తొలుత ఇన్స్యూరెన్స్ సౌకర్యం ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని సర్క్యులర్ జారీ చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన మాత్రమే ఉంటుందని, ఉద్యోగాల తొలగింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News