పెళ్లికి యాంటీ అంటున్న ‘పెప్సీ ఆంటీ’

దిశ, సినిమా : ‘గౌతమ్‌నంద’ తర్వాత మ్యాచో మ్యాన్ గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో వస్తున్న మరో మూవీ ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలంగాణ ఫిమేల్ కబడ్డీ జట్టు కోచ్‌‌‌గా తమన్నా, ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌‌గా గోపీచంద్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో భూమిక కనిపించనుంది. ఈ సినినమా నుంచి ఇటీవలే విడుదలైన ‘జ్వాలారెడ్డి’ సాంగ్‌ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దూసుకుపోతుండగా.. ఈ రోజు(ఆదివారం) మరో సాంగ్ రిలీజ్ చేసింది […]

Update: 2021-03-21 02:23 GMT
పెళ్లికి యాంటీ అంటున్న ‘పెప్సీ ఆంటీ’
  • whatsapp icon

దిశ, సినిమా : ‘గౌతమ్‌నంద’ తర్వాత మ్యాచో మ్యాన్ గోపీచంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబోలో వస్తున్న మరో మూవీ ‘సీటీమార్’. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలంగాణ ఫిమేల్ కబడ్డీ జట్టు కోచ్‌‌‌గా తమన్నా, ఆంధ్ర కబడ్డీ టీమ్ కోచ్‌‌గా గోపీచంద్ నటిస్తుండగా మరో కీలక పాత్రలో భూమిక కనిపించనుంది.

ఈ సినినమా నుంచి ఇటీవలే విడుదలైన ‘జ్వాలారెడ్డి’ సాంగ్‌ సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దూసుకుపోతుండగా.. ఈ రోజు(ఆదివారం) మరో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రవితేజ ‘క్రాక్‌’ సినిమాలో ‘భూమ్‌ బద్దల్‌’ సాంగ్‌తో దుమ్ములేపిన వర్మ హీరోయిన్‌ అప్సరా రాణి.. తాజాగా ‘ నా పేరే పెప్సీ ఆంటీ.. నా పెళ్లికి నేనే యాంటీ’ అంటూ మరో మాస్‌ పర్ఫార్మెన్స్‌తో హీటెక్కించింది. ‘సీటీమార్’‌లో ‘పెప్సీ ఆంటీ’గా స్పెషల్ సాంగ్ చేయగా, లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఈ ఐటెం సాంగ్‌కు డైరెక్టర్ సంపత్ నంది లిరిక్స్ అందించడం విశేషం. ఈ పాటను కీర్తన శర్మ పాడగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ మ్యూజిక్ అందించారు. కాగా పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News