టీకా కోసం కోట్లాట.. వెయ్యికి పైగా బారులు తీరిన జనం

దిశ, జగిత్యాల : కొవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు కోసం గురువారం జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా కేంద్రం వుండటంతో తెల్లవారుజాము నుండే సమీప గ్రామాల నుంచి యువకులు, వృద్ధులు, మహిళలు అధికంగా తరలివచ్చారు. సుమారు వెయ్యి మందికి పైగా జనం సెకండ్ డోస్ కోసం రావడంతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది. అయితే, […]

Update: 2021-07-08 09:12 GMT

దిశ, జగిత్యాల : కొవిడ్ వ్యాక్సిన్ రెండవ డోసు కోసం గురువారం జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో టీకా కేంద్రం వుండటంతో తెల్లవారుజాము నుండే సమీప గ్రామాల నుంచి యువకులు, వృద్ధులు, మహిళలు అధికంగా తరలివచ్చారు. సుమారు వెయ్యి మందికి పైగా జనం సెకండ్ డోస్ కోసం రావడంతో ఆసుపత్రి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

అయితే, వారు కొవిడ్ నిబంధనలు పాటించక ఒకరిపై ఒకరు పడుతూ భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ కోసం వచ్చిన వారు చెప్పులు, సంచులు వరుసలో క్యూ లైన్‌‌లో పెట్టారు. అయితే, రెండవ డోస్‌కు సెంటర్లు లేక ఈ పరిస్థితి ఏర్పడిందని, వ్యాక్సిన్ సెంటర్లు పెంచితే ఎవరికి ఇబ్బంది ఉండదని, వెంటనే సెంటర్ల సంఖ్య పెంచాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

Tags:    

Similar News