ప్రజలు ఛీ కొట్టినా ఉమా మారడం లేదు : మల్లాది విష్ణు ఫైర్

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. దేవినేని ఉమాను గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా మారడం లేదన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి అనుచరగణంతో రాత్రి పూట […]

Update: 2021-07-28 06:17 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుపై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలంతా టీడీపీని ఏకపక్షంగా తిరస్కరించినా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. దేవినేని ఉమాను గత ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా మారడం లేదన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మైనింగ్ అక్రమాలు జరిగితే అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సింది పోయి అనుచరగణంతో రాత్రి పూట పరిశీలనకు‌ వెళ్తారా అని ప్రశ్నించారు. దీనిని ప్రశ్నిస్తే స్థానిక వైసీపీ నేతలపై దాడి చేశారని చెప్పుకొచ్చారు.

ఏదోరకంగా‌ వసంత కృష్ణ ప్రసాద్‌పై బురద జల్లాలని‌ చూస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. ఇకనైనా దేవినేని ఉమా ఇలాంటి డ్రామాలు ఆపాలని లేకపోతే గతంలో జక్కంపూడిలో ప్రజలే తరిమి కొట్టినట్లుగా కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఉమ అనే వ్యక్తి రాజకీయ నాయకుడు కాదని గోబెల్స్ అని విరుచుకుపడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఘటనపై పోలీసులు కూడా వాస్తవాలను ఇప్పటికే వెల్లడించారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు.

Tags:    

Similar News