ఏసీబీకి చిక్కిన పెద్దేముల్ ఎస్ఐ చంద్రశేఖర్
దిశ, తాండూరు: జిల్లాలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఏసీబీకి చిక్కాడు. మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్ సంబంధీకులు అయిన నర్సింహులు, శేఖర్ లకు సంబంధించిన ట్రాక్టర్లను ఎస్ఐ చంద్రశేఖర్ పట్టుకున్నాడు. అయితే ట్రాక్టర్లు ఫార్ధార్ ప్రాసెస్ చేయడం కోసం ఎస్ఐ చంద్రశేఖర్ 60 వేలు డిమాండ్ చేయగా, 50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, బాధితుడు ఎంపీటీసీ శ్రీనివాస్ తెలిపిన […]
దిశ, తాండూరు: జిల్లాలో అవినీతి తిమింగలాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా వికారాబాద్ జిల్లా పెద్దేముల్ సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ ఏసీబీకి చిక్కాడు. మంబాపూర్ ఎంపీటీసీ శ్రీనివాస్ సంబంధీకులు అయిన నర్సింహులు, శేఖర్ లకు సంబంధించిన ట్రాక్టర్లను ఎస్ఐ చంద్రశేఖర్ పట్టుకున్నాడు. అయితే ట్రాక్టర్లు ఫార్ధార్ ప్రాసెస్ చేయడం కోసం ఎస్ఐ చంద్రశేఖర్ 60 వేలు డిమాండ్ చేయగా, 50వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.
ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ, బాధితుడు ఎంపీటీసీ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం… గత 15 రోజుల క్రితం మంబాపూర్ ఎంపీటీసీ యాలాటి శ్రీనివాస్ కు సంబంధించిన AP24AD2136, AP29TA3037 అనే ఇసుక ట్రాక్టరులను ఇటీవలే పట్టుకున్నాడు. ఆ ట్రాక్టర్ కోర్టులో డిపాజిట్ ప్రాసెస్ చేయడానికి 50 వేల రూపాయలు డిమాండ్ చేయగా, మూడు రోజుల క్రితం రూ.20వేలు ఇచ్చాడు. మిగతా రూ.30వేలు ఇస్తుండగా పొలీస్ స్టేషన్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్ఐ చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేసి రేపు రిమాండ్ చేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఎస్ఐ చంద్రశేఖర్ ఇంట్లో సైతం అక్రమ ఆస్తులపై విచారణ చేయనున్నట్లు వెల్లడించారు.