మసీదు, నల్లపోచమ్మ ఆలయాల కూల్చివేత దుర్మార్గం

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ మూఢ నమ్మకాలతో పురాతన భవనాలు కూలుతున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో మసీదు, నల్లపోచమ్మ ఆలయాలను కూల్చివేయడం దుర్మార్గమని, దేవాలయాల కూల్చివేతను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు. కరోనా వైరస్‌ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మరణాల మీద మొత్తం తప్పుడు లెక్కలే చెబుతుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ.. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఎన్నికలపై దృష్టి పెట్టిందని అన్నారు. జీహెచ్ఎంసీలో ఒక్కోవార్డులో […]

Update: 2020-08-16 04:53 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫైర్ అయ్యారు. కేసీఆర్ మూఢ నమ్మకాలతో పురాతన భవనాలు కూలుతున్నాయని మండిపడ్డారు. సచివాలయంలో మసీదు, నల్లపోచమ్మ ఆలయాలను కూల్చివేయడం దుర్మార్గమని, దేవాలయాల కూల్చివేతను పార్లమెంట్‌లో లేవనెత్తుతామని అన్నారు. కరోనా వైరస్‌ నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, మరణాల మీద మొత్తం తప్పుడు లెక్కలే చెబుతుందని విమర్శించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ.. జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం ఎన్నికలపై దృష్టి పెట్టిందని అన్నారు. జీహెచ్ఎంసీలో ఒక్కోవార్డులో ఒక్కో తీరుగా ఓటర్లున్నారని, ప్రభుత్వ వైఫలయ్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెబుతామని పేర్కొన్నారు.

Tags:    

Similar News