నిర్వాసితుల సమస్య పట్టదా : శైలజానాథ్

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​ మోహన్​రెడ్డి ఒక్కసారైనా పోలవరం నిర్వాసితుల వద్దకెళ్లారా.. వాళ్ల కష్టాలను చూశారా అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్​ ప్రశ్నించారు. వైసీపీ నేతలంతా రైతు ద్రోహులని అభివర్ణించారు. ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్​తో కలిసి రాజమండ్రిలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… శాసనసభ సమావేశాలు చూస్తుంటే సిగ్గు వేస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల ఉపయోగం ఉందా? అని ప్రశ్నించారు. కనీసం ఒక్క రోడ్డు కూడా జగన్ వేయలేదని అన్నారు. జగన్ బీజేపీకి […]

Update: 2020-12-04 11:54 GMT

దిశ, ఏపీ బ్యూరో: సీఎం జగన్​ మోహన్​రెడ్డి ఒక్కసారైనా పోలవరం నిర్వాసితుల వద్దకెళ్లారా.. వాళ్ల కష్టాలను చూశారా అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్​ ప్రశ్నించారు. వైసీపీ నేతలంతా రైతు ద్రోహులని అభివర్ణించారు. ఆయన మాజీ ఎంపీ హర్షకుమార్​తో కలిసి రాజమండ్రిలో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ… శాసనసభ సమావేశాలు చూస్తుంటే సిగ్గు వేస్తోందన్నారు. అసెంబ్లీ సమావేశాల వల్ల ఉపయోగం ఉందా? అని ప్రశ్నించారు.

కనీసం ఒక్క రోడ్డు కూడా జగన్ వేయలేదని అన్నారు. జగన్ బీజేపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పారు. బీజేపీ నాయకత్వంలో వైఎస్ జగన్ చేస్తున్న అకృత్యాలను కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. ఈనెల 21 నుంచి పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. స్థానిక ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News