2లక్షల ఖాళీలుంటే 50 వేలే భర్తీ చేస్తారా..? : రేవంత్ రెడ్డి

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సుమారు 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిషన్​ నివేదిక ఇచ్చిందని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగుల తరుపున పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌కు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్టాఫ్ నర్సుల అంశాన్ని అందులో ప్రస్తావించారు. తొలగించిన స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. […]

Update: 2021-07-10 04:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సుమారు 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పీఆర్సీ కమిషన్​ నివేదిక ఇచ్చిందని, వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని టీపీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి మండిపడ్డారు. నిరుద్యోగుల తరుపున పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్‌కు రేవంత్​రెడ్డి బహిరంగ లేఖ రాశారు. స్టాఫ్ నర్సుల అంశాన్ని అందులో ప్రస్తావించారు. తొలగించిన స్టాఫ్ నర్సులను విధుల్లో కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఉన్నపళంగా ఉద్యోగాలు తొలగించి 1640 కుటుంబాలను రోడ్డున పడేశారని, ప్రగతి భవన్ ప్రజల కష్టాలు విని, కన్నీళ్లు తుడవాల్సిన సీఎం కార్యాలయమా లేక.. కల్వకుంట్ల ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ కార్యాలయమా..? అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో 1.91 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిశ్వాల్‌ కమిటీ చెప్పిందని, సుమారు 2 లక్షల పోస్టులుంటే 50 వేలే భర్తీ చేస్తారా..? అని లేఖలో ప్రశ్నించారు. 1.91 లక్ష ఉద్యోగాల ఖాళీలతో పాటుగా కార్పొరేషన్లలోని ఖాళీల భర్తీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 2018లో ఎంపికైన ఏఎన్‌ఎంలకు ఇప్పటికీ పోస్టులు లేవని, 2018 ఏఎన్‌ఎం అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలివ్వాలని, స్టాఫ్‌ నర్సులను విధుల్లో కొనసాగించాలన్నారు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే వారి తరఫున పోరాటం కొనసాగిస్తామని రేవంత్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఇదిలాఉండగా తమను ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి స్టాఫ్​నర్సులు వినతిపత్రం అందించారు. న్యాయం జరిగే వరకు కాంగ్రెస్​పార్టీ వారికి అండగా ఉంటుందని, నర్సుల తరఫున పోరాటం చేస్తామని ఆయన భరోసా కల్పించారు.

Tags:    

Similar News