పాక్‌లో విండీస్ టూర్ కొనసాగేనా?
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటన పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనే డైలమా ఇంకా కొనసాగుతున్నది. వెస్టిండీస్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్-19బారిన పడ్డారు. దీంతో గురువారం జరగాల్సిన ఆఖరి టీ20 మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది. అయితే విండీస్ బోర్డును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పించింది. దీంతో ఆఖరి టీ20 షెడ్యూల్ ప్రకారం జరిగింది. అయితే ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లు కూడా జరగాల్సి ఉన్నది. […]
దిశ, స్పోర్ట్స్: పాకిస్తాన్‌లో వెస్టిండీస్ క్రికెట్ జట్టు పర్యటన పూర్తి స్థాయిలో జరుగుతుందా లేదా అనే డైలమా ఇంకా కొనసాగుతున్నది. వెస్టిండీస్ జట్టులోని ఆరుగురు ఆటగాళ్లు కోవిడ్-19బారిన పడ్డారు. దీంతో గురువారం జరగాల్సిన ఆఖరి టీ20 మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానం నెలకొంది. అయితే విండీస్ బోర్డును పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పించింది. దీంతో ఆఖరి టీ20 షెడ్యూల్ ప్రకారం జరిగింది. అయితే ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లు కూడా జరగాల్సి ఉన్నది. అయితే 21 మందితో వచ్చిన వెస్టిండీస్ టీమ్‌లో ఆరుగురు కరోనా బారిన పడటంతో పాటు డెవాన్ థామస్ గాయం కారణంగా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో 14 మందితోనే వన్డే సిరీస్ ఆడుతుందా అనే అనుమానం నెలకొన్నది. ప్రస్తుతానికి టీ20 సిరీస్ ముగిసినా.. వన్డే సిరీస్‌పై ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకుంటాయని తెలుస్తున్నది. ఒక వేళ విండీస్ ఆటగాళ్లు వన్డే సిరీస్ ఆడటానికి సిద్దంగా లేకపోతే.. పర్యటన అర్దంతరంగా ముగిసే అవకాశాలు ఉన్నాయి.