ఐపీఓకు పేటీఎమ్ సిద్ధం.. పోటీలో మరో రెండు కంపెనీలు
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొంత విరామం తీసుకున్న ఐపీఓల సందడి మళ్లీ మొదలుకానుంది. ఈ నెల రెండో వారంలో పేటీఎమ్ సహా మరో రెండు సంస్థలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు కంపెనీలు కలిసి మొత్తం రూ.21,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎమ్, కేఎఫ్‌సీ నిర్వహణ సఫైర్ ఫుడ్స్, అనలిటిక్ కంపెనీ లాటెంట్ వ్యూ పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. పేటీమ్ సంస్థ 8-10వ తేదీల మధ్య మొత్తం […]
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కొంత విరామం తీసుకున్న ఐపీఓల సందడి మళ్లీ మొదలుకానుంది. ఈ నెల రెండో వారంలో పేటీఎమ్ సహా మరో రెండు సంస్థలు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమవుతున్నాయి. ఈ మూడు కంపెనీలు కలిసి మొత్తం రూ.21,000 కోట్ల నిధులను సమీకరించనున్నాయి. ఫిన్‌టెక్ సంస్థ పేటీఎమ్, కేఎఫ్‌సీ నిర్వహణ సఫైర్ ఫుడ్స్, అనలిటిక్ కంపెనీ లాటెంట్ వ్యూ పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి.
పేటీమ్ సంస్థ 8-10వ తేదీల మధ్య మొత్తం రూ.18,300 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓకు కంపెనీ ఒక్కో షేర్ రూ.2,080-2,150గా నిర్ణయించింది. 2010లో కోల్ ఇండియా సమీకరించిన రూ.15,200 కోట్ల నిధుల తర్వాత పేటీఎమ్‌దే అతిపెద్ద ఐపీఓ కానుంది. అలాగే కేఎఫ్‌సీ, పిజ్జా లాంటి ఫుడ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే సఫైర్ ఫుడ్స్ ఈ నెల 9-11 మధ్య ఐపీఓకు రానుంది. మొత్తం రూ.1,838 కోట్లను ఈ సంస్థ సేకరించనుంది. మరో సంస్థ లాటెంట్ వ్యూ అనలిటిక్స్ రూ.600 కోట్లను సమీకరించేందుకు ఒక్కో షేర్‌ను రూ.190-197 మధ్య నిర్ణయించింది.