35 వేల వేతనంతో భారీగా నియామకాలు చేపట్టనున్న పేటీఎం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఐపీఓకు ముందు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 20 వేల మంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న పోటీతత్వంతో పాటు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారత డిజిటల్ ఆర్థిక సేవల రంగంలో గూగుల్ పే, ఫోన్‌పే కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్న కారణంగా పేటీఎం ఈ […]

Update: 2021-07-28 23:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం ఐపీఓకు ముందు కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 20 వేల మంది ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలు చేపట్టనున్నట్టు సమాచారం. దేశీయ మార్కెట్లో పెరుగుతున్న పోటీతత్వంతో పాటు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. భారత డిజిటల్ ఆర్థిక సేవల రంగంలో గూగుల్ పే, ఫోన్‌పే కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్న కారణంగా పేటీఎం ఈ ప్రణాళిక చేపడుతున్నట్టు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

కొత్త నియామకాల ద్వారా కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో ఉన్న పేటీఎం, క్యూఆర్ కోడ్, పీఓఎస్ మెషిన్, వ్యాలెట్, యూపీఐ, పేటీఎం సౌండ్‌బాక్స్, పేటీఎం పోస్ట్, ఇన్సూరెన్స్ స్కీమ్, మర్చంట్ లోన్ లాంటి వాటిని మరింత ప్రమోట్ చేయాలని కంపెనీ భావిస్తోంది. అంతేకాకుండా ఈ ఉద్యోగాలకు అండర్ గ్రాడ్యుయేట్లు కూడా అర్హులుగా ఉంటారని, అండర్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పేటీఎం తన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ నియామక కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు పరిశ్రమకు చెందిన విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 20 వేల మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలకు రూ .35 వేల జీతం చెల్లించనున్నట్టు సమాచారం. ఈ నిర్ణయాలతో పేటీఎం సంస్థ భారీగా వ్యాపార విస్తరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News