పేటీఎం నుంచి ‘ఆండ్రాయిడ్ పీవోఎస్ డివైస్’

దిశ, వెబ్‌డెస్క్: డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ ‘పేటీఎం’.. దేశంలోని వ్యాపారుల కోసం కొత్త‌గా ఆండ్రాయిడ్ ఆధారిత పీవోఎస్ డివైస్‌ను లాంచ్ చేసింది. అచ్చం ఫోన్‌ మాదిరే ఉండే ఈ డివైస్‌ను వ్యాపారులు సుల‌భంగా వాడొచ్చు. వినియోగ‌దారుల నుంచి ఈజీగా, వేగంగా పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ప‌ద్ధ‌తిలో పేమెంట్ల‌ను స్వీక‌రించ‌వ‌చ్చు. పేటీఎం లాంచ్ చేసిన ఈ ఆల్ ఇన్ వ‌న్ పోర్ట‌బుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పీవోఎస్ డివైస్‌ను ప్ర‌స్తుతం రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో ఇస్తున్నారు. దీనికి గాను వ్యాపారులు నెల‌కు రూ.499 […]

Update: 2020-08-11 04:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ ‘పేటీఎం’.. దేశంలోని వ్యాపారుల కోసం కొత్త‌గా ఆండ్రాయిడ్ ఆధారిత పీవోఎస్ డివైస్‌ను లాంచ్ చేసింది. అచ్చం ఫోన్‌ మాదిరే ఉండే ఈ డివైస్‌ను వ్యాపారులు సుల‌భంగా వాడొచ్చు. వినియోగ‌దారుల నుంచి ఈజీగా, వేగంగా పూర్తిగా కాంటాక్ట్‌లెస్ ప‌ద్ధ‌తిలో పేమెంట్ల‌ను స్వీక‌రించ‌వ‌చ్చు.

పేటీఎం లాంచ్ చేసిన ఈ ఆల్ ఇన్ వ‌న్ పోర్ట‌బుల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ పీవోఎస్ డివైస్‌ను ప్ర‌స్తుతం రెంట‌ల్ ప‌ద్ధ‌తిలో ఇస్తున్నారు. దీనికి గాను వ్యాపారులు నెల‌కు రూ.499 చెల్లించాల్సి ఉంటుంది. ఈ డివైస్‌ను ‘పేటీఎం ఫ‌ర్ బిజినెస్‌’కు అనుసంధానించి వాడుకోవడంతో పాటు జీఎస్‌టీ కంప్లయింట్ బిల్స్‌ను జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. లావాదేవీలు, సెటిల్‌మెంట్ల‌ను మేనేజ్ చేయ‌డంతో పాటు లోన్లు, ఇన్సూరెన్స్‌, డిజిట‌ల్ లెడ్జ‌ర్ స‌దుపాయాల‌ను కూడా పొంద‌వ‌చ్చు. అంతేకాకుండా క్యూఆర్ కోడ్‌ల‌ను స్కాన్ చేసుకునే అవకాశంతో పాటు 4జీ స‌దుపాయం కూడా ఉంది. దీన్ని పేటీఎంకు చెందిన స్కాన్ టు ఆర్డ‌ర్‌, పేటీఎం ఫ‌ర్ బిజినెస్‌తో అనుసంధానించి ఉపయోగించుకోవచ్చు.

పేటీఎం కొత్త పీవోఎస్ డివైస్‌లో 4.5 ఇంచుల ట‌చ్ స్క్రీన్ ఉంటుంది. ఒక్క‌సారి ఫుల్ చార్జ్ చేస్తే దీన్ని రోజంతా పేమెంట్ల‌కు ఉప‌యోగించుకోవ‌చ్చు. క్యూఆర్ కోడ్స్‌ను స్కాన్ చేసేందుకు కెమెరా స‌దుపాయం ఉండగా, 4జీ సిమ్ కార్డును వేసుకోవ‌చ్చు. వైఫై క‌నెక్షన్‌తో పాటు బ్లూటూత్ స‌దుపాయమున్న ఈ డివైస్ కేవ‌లం 163 గ్రాముల బ‌రువు మాత్ర‌మే ఉంటుంది. ఇందులో ఏర్పాటు చేసిన పేటీఎంకు చెందిన క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌ స‌హాయంతో బిల్లింగ్‌, పేమెంట్స్‌, క‌స్ట‌మ‌ర్ మేనేజ్‌మెంట్ వంటి సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు.

వచ్చే మరికొన్ని నెలల్లో దాదాపు 2 లక్షల డివైస్‌లను వ్యాపారులకు అందజేయాలనే లక్ష్యంతో పేటీఎం.. ఒక్క నెలలో 20 మిలియన్ల ట్రాన్షక్షన్స్ జరిగేలా టార్గె‌ట్‌గా పెట్టుకుంది. ‘వ్యాపారులు ఈజీగా డిజిటల్ లావాదేవీలు జరుపుకునేందుకు ఈ పాకెట్ సైజ్ పేటీఎం ఆండ్రాయిడ్ పీవోఎస్ డివైస్ ఉపయోగపడుతుందని’ పేటీఎం వైస్ ప్రెసిడెంట్ రేణు సత్తి తెలిపారు.

Tags:    

Similar News