అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లకు ఈనెల 24న చెల్లింపులు

దిశ, ఏపీ బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.20వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి అకౌంట్‌లో ఈనెల 24న సీఎం వైఎస్ జగన్ నేరుగా వారిఖాతాలో నగదు జమ చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను ఆయా గ్రామ / వార్డు సచివాలయాల్లో సమర్పించాలని […]

Update: 2021-08-04 10:43 GMT

దిశ, ఏపీ బ్యూరో : అగ్రిగోల్డ్‌ బాధితులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.20వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి అకౌంట్‌లో ఈనెల 24న సీఎం వైఎస్ జగన్ నేరుగా వారిఖాతాలో నగదు జమ చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులైన అగ్రిగోల్డ్‌ ఖాతాదారులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను ఆయా గ్రామ / వార్డు సచివాలయాల్లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ను తప్పనిసరిగా చూపించాలని అప్పుడే నగదు జమ చేస్తామని తెలిపింది. బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను సైతం ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Tags:    

Similar News