నాలుగేండ్లు దాటితే కేసు నమోదే
దిశ, వెబ్ డెస్క్: బైక్ పై వెనక కూర్చున వాళ్లు సైతం తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారని, వీరిలో ఎక్కువగా వెనుక కూర్చున్న వాళ్లే మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదాలను నివారించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు. బైక్ పై నాలుగేండ్లకు పైబడిన చిన్నారులకు సైతం హెల్మెంట్ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్నారులే కదా అని వదిలేయవద్దని కోరారు. నాలుగేండ్లు […]
దిశ, వెబ్ డెస్క్: బైక్ పై వెనక కూర్చున వాళ్లు సైతం తప్పని సరిగా హెల్మెంట్ ధరించాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల్లో 70 శాతం ద్విచక్ర వాహనదారులే మరణిస్తున్నారని, వీరిలో ఎక్కువగా వెనుక కూర్చున్న వాళ్లే మృత్యువాత పడుతున్నారని చెప్పారు. ఈ ప్రమాదాలను నివారించడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారు.
బైక్ పై నాలుగేండ్లకు పైబడిన చిన్నారులకు సైతం హెల్మెంట్ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. చిన్నారులే కదా అని వదిలేయవద్దని కోరారు. నాలుగేండ్లు పైబడిన చిన్నారులతో కలిసి త్రిపుల్ రైడింగ్ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. హెల్మెంట్ లేకపోయినా, మాస్క్ లేకపోయినా ప్రత్యేక సాఫ్ట్ వేర్ కలిగిన కెమెరాలతో ఫొటోలు తీసి జరిమాన విధించడంతోపాటు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.