'గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించండి'

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. శనివారం ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన నాదెండ్ల మనోహర్ గెస్ట్ లెక్చరర్లకు జీతాలివ్వకపోవడం అన్యాయమన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు. గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు […]

Update: 2021-07-31 11:58 GMT

దిశ, ఏపీ బ్యూరో: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించాలని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. శనివారం ఏపీ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. గెస్ట్ లెక్చరర్లకు జీతాలు ఇవ్వడం లేదని వారు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన నాదెండ్ల మనోహర్ గెస్ట్ లెక్చరర్లకు జీతాలివ్వకపోవడం అన్యాయమన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇప్పుడు పట్టించుకోకపోవడం సరికాదన్నారు.

గత నాలుగేళ్లుగా గెస్ట్ లెక్చరర్లకు జీతాలు చెల్లించకుండా పని చేయించుకోవడం అన్యాయమన్నారు. 1100 మంది ఈ తరహాలో విధులు నిర్వహిస్తున్నారని వారంతా ఆకలితో అలమటస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం తక్షణమే బకాయిపడ్డ జీతాలు చెల్లించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఖచ్చితంగా వీరికి అండగా పోరాటం చేస్తోందని పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ హెచ్చరించారు.

Tags:    

Similar News