చేనేత రంగాన్ని ఆదుకోవాలన్న పవన్!

దిశ, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా చేనేత వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో..ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో చేనేత వృత్తిని నమ్ముకుని ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, రోజు గడిస్తేనే వారికి కడుపు నిండుతుందని..కరోనా వల్ల వారికి పూట గడవడమే కష్టంగా ఉందని పవన్ ప్రస్తావించారు. చేనేత కుటుంబాల్లో కష్టాలున్నాయని పార్టీ కార్యాలయానికి విజ్ఞాపనలు అందాయి. […]

Update: 2020-05-03 06:42 GMT

దిశ, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా చేనేత వృత్తిని నమ్ముకున్న కుటుంబాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని, ప్రభుత్వం చేనేత కార్మికుల్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో..ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో చేనేత వృత్తిని నమ్ముకుని ఆధారపడి లక్షల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, రోజు గడిస్తేనే వారికి కడుపు నిండుతుందని..కరోనా వల్ల వారికి పూట గడవడమే కష్టంగా ఉందని పవన్ ప్రస్తావించారు.

చేనేత కుటుంబాల్లో కష్టాలున్నాయని పార్టీ కార్యాలయానికి విజ్ఞాపనలు అందాయి. రాష్ట్రంలో చేనేత వృత్తిని నమ్ముకుని 2.5 లక్షల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ప్రభుత్వం ఏడాది క్రితం నేతన్న నేస్తం పథకం కింద 83 వేల మందికి మాత్రమే ఆర్థిక సాయం చేసిందని పవన్ పేర్కొన్నారు. అలాగే, లాక్‌డౌన్ విధించడంతో చేనేత రంగ పూర్తిగా కుదేలైంది. ఈ రంగాన్ని నమ్ముకుని బతికే వారికి భరోసా భారమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రతి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం ఇవ్వాలని ఆ కుటుంబాలు కోరుతున్నారు తెలిపారు. చేనేత కార్మికుల డిమాండ్ సహేతుకమైనది. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత వారి జీవనోపాధికి మార్గాలను చూపించడమే కాకుండా, ముడి సరుకును ప్రభుత్వమే అందించాలని, ఆ బాధ్యత రాష్ట్ర జౌళి శాఖ చూసుకోవాలన్నారు. నేతన్న నేస్తం లాంటి పథకం కొందరికే పరిమితమవడం సబబు కాదు, మిగిలిన అందరికీ అమలు చేయాలని పవన్ చెప్పారు.

Tags: andhrapradesh, pawan kalyan, handloom weavers, handloom weavers demand, ap

Tags:    

Similar News