ఫొటోగ్రాఫర్ల పక్షాన పవన్ కల్యాణ్
దిశ, అమరావతి: స్వయం ఉపాధిలో భాగంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలను ఆధారంగా చేసుకున్న వారు కరోనా మూలంగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వివాహాది శుభాకార్యాలు ఉన్న మంచి రోజులన్నీ లక్ డౌన్ లోనే పోయాయి. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకునే సమయంలో స్టూడియోలు మూసివేయాల్సి వచ్చింది. ఈ పరిణామామంతో తామంతా ఆదాయం లేక అప్పు దొరికే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఏపీ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆదేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన […]
దిశ, అమరావతి: స్వయం ఉపాధిలో భాగంగా ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీలను ఆధారంగా చేసుకున్న వారు కరోనా మూలంగా ఎన్నో ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. వివాహాది శుభాకార్యాలు ఉన్న మంచి రోజులన్నీ లక్ డౌన్ లోనే పోయాయి. వారికి నాలుగు డబ్బులు సంపాదించుకునే సమయంలో స్టూడియోలు మూసివేయాల్సి వచ్చింది. ఈ పరిణామామంతో తామంతా ఆదాయం లేక అప్పు దొరికే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని ఏపీ ఫొటోగ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆదేదన వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్ కష్టకాలంలో ఉన్న ఫొటో, వీడియో గ్రాఫ్రర్లకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే వారికి ఆరోగ్య బీమా, హెల్త్ కార్డులు అందించాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.