అమరావతిపై జనసేన కీలక నిర్ణయం..

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని తరలింపు విషయమై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతినే రాజధాని కొనసాగించే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపునకు వేగంగా అడుగులు వేస్తుండటంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించింది. కౌంటర్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసులో తుదివరకు బాధ్యతగా పోరాడాలని, న్యాయనిపుణుల సహకారంతో గడువులోగా […]

Update: 2020-08-29 05:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ రాజధాని తరలింపు విషయమై జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసైనికులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అమరావతినే రాజధాని కొనసాగించే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. అయితే, ఏపీ ప్రభుత్వం రాజధాని తరలింపునకు వేగంగా అడుగులు వేస్తుండటంతో దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జనసేన నిర్ణయించింది.

కౌంటర్ దాఖలు చేయడంతో పాటు ఈ కేసులో తుదివరకు బాధ్యతగా పోరాడాలని, న్యాయనిపుణుల సహకారంతో గడువులోగా కౌంటర్ వేయాలని అధినేత పవన్ జనసైనికులకు వివరించినట్లు తెలుస్తోంది. నాటి ప్రభుత్వాన్ని నమ్మి 28వేల మంది రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారని, ఇప్పటికే ఆ భూముల్లో పలు నిర్మాణాలు చేపట్టారని పవన్‌కళ్యాణ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Tags:    

Similar News