పెద్ద సంఖ్యలో టెస్టులు సరే.. మరి చికిత్స?
దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ కృషి చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనాను సాధారణ జ్వరంతో పోల్చడం దారుణమని పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వస్తుంది.. పోతుంది అంటూ నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నిత్యం 4 వేల నుంచి 5 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయని, ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. కరోనా పరీక్షలు పెద్ద సంఖ్యలో […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ కృషి చేస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కరోనాను సాధారణ జ్వరంతో పోల్చడం దారుణమని పవన్ కల్యాణ్ అన్నారు. కరోనా వస్తుంది.. పోతుంది అంటూ నిర్లిప్త ధోరణితో వ్యవహరిస్తే వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని జనసేనాని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో నిత్యం 4 వేల నుంచి 5 వేల వరకు కొత్త కేసులు వస్తున్నాయని, ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
కరోనా పరీక్షలు పెద్ద సంఖ్యలో చేస్తున్నామని గొప్పలు చెప్పుకోవడమే కాదు.. ఆసుపత్రుల్లో కరోనా రోగులకు మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఆక్సిజన్ కొరత, వెంటిలేటర్లు, పడకలు, నాసిరకం ఆహారం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.