నాగబాబు వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే..?

దిశ ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు గాడ్సే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ట్వీట్ జనసేన విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. దీంతో వాటిని దూరం చేసేందుకు నాగబాబు ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలను పలుచన చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో దీనిపై సోషల్ మీడియాలో నాగబాబుతో పాటు జనసేన కూడా ట్రోల్ అవుతోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పార్టీ […]

Update: 2020-05-23 06:37 GMT

దిశ ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు గాడ్సే జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ట్వీట్ జనసేన విశ్వసనీయతపై అనుమానాలు లేవనెత్తిన సంగతి తెలిసిందే. దీంతో వాటిని దూరం చేసేందుకు నాగబాబు ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలో చేసిన వ్యాఖ్యలను పలుచన చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీంతో దీనిపై సోషల్ మీడియాలో నాగబాబుతో పాటు జనసేన కూడా ట్రోల్ అవుతోంది.

ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగి ప్రకటన విడుదల చేశారు. లక్షల సంఖ్యలో ఉన్న కార్యకర్తలు, నాయకులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవని, వాటితో జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. కొన్ని సున్నితమైన అంశాలపై పార్టీకి చెందిన వారు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారని, వాటిని కూడా పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున ఈ వివరణ ఇస్తున్నామని పవన్ వెల్లడించారు.

పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పార్టీపరమైన నిర్ణయాలు, అభిప్రాయాలను జనసేన అధికారిక పత్రం ద్వారా, పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే వెల్లడిస్తామని తెలిపారు. కరోనా కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో, ప్రజాసేవ తప్ప మరో అంశం జోలికి వెళ్లవద్దని కోరుతున్నట్టు పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ ఉల్లంఘించవద్దని ఆయన సూచించారు.

Tags:    

Similar News