పెద్ద మనసున్న సినీ కుటుంబానికి అభినందనలు : పవన్

ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో ప్రభుత్వానికి, సినీ కార్మికులకు సినీ తారలు అండగా నిలబడడాన్ని అభినందించారు. వైరస్ కట్టడికి… లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండే పేదలకు ఆర్థిక అండ అవసరమని… అగ్రశ్రేణి తారలంతా ఈ పోరులో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.పీఎం కేర్స్ ఫండ్ కు భారీ మొత్తంలో రూ. 25 కోట్ల విరాళం అందించిన […]

Update: 2020-03-29 22:24 GMT

ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కరోనా మహమ్మారి విజృంభించిన తరుణంలో ప్రభుత్వానికి, సినీ కార్మికులకు సినీ తారలు అండగా నిలబడడాన్ని అభినందించారు. వైరస్ కట్టడికి… లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండే పేదలకు ఆర్థిక అండ అవసరమని… అగ్రశ్రేణి తారలంతా ఈ పోరులో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు.పీఎం కేర్స్ ఫండ్ కు భారీ మొత్తంలో రూ. 25 కోట్ల విరాళం అందించిన అక్షయ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు పవన్.

సినీ కళాకారులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ‘కరోనా క్రైసిస్ చారిటీ’ పేరుతో సంస్థను ఏర్పాటు చేయడాన్ని స్వాగతించారు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకునే ప్రయత్నానికి శ్రీకారం చుట్టడం గొప్ప పరిణామం అన్నారు పవన్. ఈ సంస్థకు కమిటీ చైర్మన్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి, కమిటీ సభ్యులను అభినందించారు. చారిటికి లక్షల్లో విరాళాలు అందించిన ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందించారు పవన్.

Tags : Pawan Kalyan, CCC, TFI, CoronaVirus, Covid19

Tags:    

Similar News

టైగర్స్ @ 42..