వాళ్ళ దుస్థితి బాధాకరం: పవన్
దిశ, అమరావతి: ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ పడుతున్న దుస్థితి చాలా బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న గురువులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓనమాలు నేర్పే గురువులు రోడ్లపై పడడం బాధాకరమన్నారు. జీతాలు లేక ఏపీలో కొందరు టీచర్లు రోడ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారని తెలిపారు. బతకలేక బడి పంతులు అన్న సామెతను ప్రస్తుత కాలంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత […]
దిశ, అమరావతి: ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో పనిచేస్తున్న టీచర్స్, లెక్చరర్స్ పడుతున్న దుస్థితి చాలా బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న గురువులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఓనమాలు నేర్పే గురువులు రోడ్లపై పడడం బాధాకరమన్నారు. జీతాలు లేక ఏపీలో కొందరు టీచర్లు రోడ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముతున్నారని తెలిపారు. బతకలేక బడి పంతులు అన్న సామెతను ప్రస్తుత కాలంలో నిజం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, యాజమాన్యాలపై ఉందని పవన్ కల్యాన్ గుర్తు చేశారు.