ఏపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ విన్నపం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విన్నపం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ… గుజరాత్‌లో చిక్కుకుపోయిన 4 వేల మంది శ్రీకాకుళం మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యండి అన్నారు. లాక్‌డౌన్ కారణంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో ఏపీకి చెందిన వేలమంది నిలిచిపోయారని, లాక్ డౌన్ పరిస్థితులను అర్థం చేసుకుని వారిని ఆదుకోవాలని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులను కానీ, ఉన్నతాధికారులను కానీ […]

Update: 2020-04-19 02:01 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా విన్నపం చేశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేస్తూ… గుజరాత్‌లో చిక్కుకుపోయిన 4 వేల మంది శ్రీకాకుళం మత్స్యకారులను రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యండి అన్నారు. లాక్‌డౌన్ కారణంగా గుజరాత్ తీర ప్రాంతాల్లో ఏపీకి చెందిన వేలమంది నిలిచిపోయారని, లాక్ డౌన్ పరిస్థితులను అర్థం చేసుకుని వారిని ఆదుకోవాలని పవన్ కోరారు. కనీసం సంబంధిత జిల్లా మంత్రులను కానీ, ఉన్నతాధికారులను కానీ గుజరాత్ పంపించి, మత్స్యకారులకు భరోసా ఇవ్వాలని సూచించారు. ఏమాత్రం పరిస్థితులు అనుకూలంగా ఉన్నా వారిని రాష్ట్రానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

Tags: pawan kalyan, janasena, twitter, ap government

Tags:    

Similar News