వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ పెరిగింది : పవన్ కల్యాణ్

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గళం విప్పారు. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేస్తున్న జనసేనాని మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని పవన్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు. గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా నడుస్తోందని తెలిపారు. జనసేన పార్టీ […]

Update: 2021-10-29 04:01 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గళం విప్పారు. ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా విమర్శల దాడి చేస్తున్న జనసేనాని మరోసారి విరుచుకుపడ్డారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో గంజాయి అక్రమ రవాణాను సామాజిక ఆర్థిక కోణంలో చూడాల్సి ఉంటుందని పవన్ ట్విటర్ వేదికగా అభిప్రాయపడ్డారు. గంజాయి వ్యవహారం ఇప్పటికిప్పుడు అకస్మాత్తుగా జరిగిందేమీ కాదని, గత 15-20 ఏళ్లుగా నడుస్తోందని తెలిపారు. జనసేన పార్టీ తరపున తాను 2018 నుంచి ఈ అంశంపై పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. తన యాత్రలో గంజాయి సాగుపై స్పందించినట్లు గుర్తు చేశారు. అయితే వైసీపీ పాలనలో గంజాయి స్మగ్లింగ్ మరింతగా విస్తరించిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

Tags:    

Similar News